వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్

ఆత్మకూరు, అనంతసాగరం మండలంలో పలు వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహా బూబ్ మస్తాన్ మాట్లాడుతూ, వేసవి తీవ్రత తగ్గి వాతావరణం మారి వర్షాకాలం వస్తుందని ఈ క్రమంలో మండల ప్రజలకు విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన బాధ్యత మండల అధికారులకు వైద్యాధికారుల పై ఉందన్నారు గత సంవత్సరం ఈ సీజన్లో అనేకమంది మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడ్డారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలోని, గ్రామపంచాయతీ అధికారులు, పరిశీలించి, నిరంతరం గ్రామాల్లో పర్యటించి, బ్లీచింగ్ తో శానిటైజేషన్ చేస్తూ ఉండాలని, రోడ్ల మీద, కాలువలు, డ్రైనేజీలో వ్యర్ధాలను లేకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఇప్పటినుండి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతారని కావున మండల అధికారులు, వైద్యాధికారులు పలు వ్యాధులు ప్రబలకుండా చూడాలని అనంత సాగరం మండలం జనసేన పార్టీ తరపున పత్రికా విలేకరులకు ప్రకటన ఇవ్వడం జరిగింది.