నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని జనసేన డిమాండ్

అకాల వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంట రాత్రికి రాత్రి చేజారిపోవడంతో రైతుల ఆవేదన చెప్పలేనిదని రాజుపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య అన్నారు, సోమవారం మండలంలోని నెమలిపురి, దేవరంపాడు, అనుపాలెం, అంచులవారిపాలెం గ్రామాలను సందర్శించి పంట నష్టపోయిన రైతులను కలిసి వారి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజుపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, చిరుధాన్యాల రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని, మొక్కజొన్న పూర్తిగా పడిపోయిందని, వరి గింజలు మొత్తం రాలిపోయాయని, మామిడి చెట్లు ఏరులతో సహా పడిపోయాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి అధికారులచే నష్ట అంచనా వేయించి రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తోట నరసయ్య తెలిపారు, అదేవిధంగా కొండమూడు గ్రామంలో 33 కెవి విద్యుత్ మెయిల్ లైన్ వైరు తెగి మెయిన్ రోడ్ లోని హోటల్స్ మీద పడడంతో గ్రైండర్లు, టీవీలు, ఫ్రిజ్లు కాలిపోయాయని, రేకుల షెడ్లు మొత్తం పడిపోయారని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, తక్షణమే విద్యుత్ శాఖ వారిపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన హోటల్ యజమానులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు, రైతులకు న్యాయం చేయాలని రాజుపాలెం మండల తహసీల్దార్ నళినికి మెమోరాండం ఇవ్వడం జరిగిందని పత్రికా విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య తెలిపారు.