బహుదానది బ్రిడ్జి కోసం జనసేన పోరాడుతుంది: దాసరి రాజు

ఇచ్చాపురం: మే మూడవ తేదిన ఇచ్చాపురం బహుదానది పైన వున్న వంతెన కూలిపోయింది. బహుదానది పైన వంతెన కూలిన రోజున ఇచ్చాపురం జనసేన ఇంచార్జ్ దాసరి రాజు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఆరోజు రాత్రి 9.30గంటలకు ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ, ఇచ్చాపురం రూరల్ ఎస్సై మరియు ఇచ్చాపురం ఎమ్మార్వో వచ్చి రేపు కలెక్టర్ గారు వస్తున్నారు దీక్షను విరమించండి అని చెప్పడం జరిగినది. తాత్కాలిక రహదారి సౌకర్యం కల్పించడం కోసం 40 లక్షల గ్రాంటు ని ఇస్తున్నట్టుగా కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగినది. తర్వాత వైసిపి సమక్షంలో కలెక్టర్ తాత్కాలిక రహదారిని 15 రోజులలో కల్పిస్తామని చెప్పడం జరిగింది. చెప్పి నేటికీ 17రోజులు అయినప్పటికి కూడా ఎటువంటి కార్యచరణ జరగలేదు. ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజు దీనిని తీవ్రంగా ఖండిస్తూ మరో వారం రోజులు లోపు యుద్ధప్రాతిపదికన తాత్కాలిక రహదారికి ఏర్పాటు చేస్తూ.. శాశ్వత రహదారి ఏర్పాటుకి ప్రభుత్వ దృష్ఠికి తీసుకొని వెళ్ళాలి. ఏదయితే కలెక్టర్ గారు, నాయకులు హామీ ఇచ్చారో అది కాగితాలికి పరిమితం కాకుండా చూడాలి. ఎటువంటి కార్యచరణ ముందుకు వెళ్ళని యడల జనసేన పార్టీ తరపు నుంచి శాంతియుత ధర్నాలకు సిద్ధమవుతుందని పత్రికా ముఖం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ వార్డ్ ఇంచార్జిలు దాసరి శేఖర్ రోకళ్ల భాస్కరరావు, ఎంపీటీసీ అభ్యర్థి పనపాన లింగరాజు, మరియు జనసైనికులు సంతోష్ బిసాయి, రుక్కు, ధుర్యోధన్, డోమ్మూరు, హేమసుందర్, వాసు, ఢిల్లీ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.