నిరుపేద కుటుంబానికి ఆర్ధికసాయమందించిన జనసేన

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం ఇటీవలే ప్రమాదానికి గురి అయ్యి ఒక నిరుపేద కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో కొత్తకోట నాగేంద్ర ఆధ్వర్యంలో 15వేల రూపాయలు ఆర్థికంగా మరియు నిత్యావసర సరుకులు ఇచ్చి ఆ కుటుంబానికి జనసేన భవిష్యత్తు లో ఏటువంటి పరిస్థితిలో కూడా అండగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఎంపీటీసీ అంపిలి విక్రమ్, సంగం నాయుడు, కొల్ల జైరాం, తులగాపు మౌళి, రాంసాయి, కృష్ణ, కొత్తకోట శ్రీను మరియు జనసేన కార్యకర్తలు పాల్గున్నారు.