హర్షత్ రామ్ కు జనసేన ఆర్థిక సాయం

పెడన నియోజకవర్గం: గూడూరు మండలం, తరకటూరు గ్రామంలో ఇటీవల జనసైనికుడు, పవన్ కళ్యాణ్ అభిమాని హర్షత్ రామ్ కాలేజీకి వెళ్తూ ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ ప్రమాదంలో హర్షత్ రాముకు కాలు ఫ్రాక్చర్ అయింది. అతను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నందువల్ల క్రియాశీల బీమా పథకం ద్వారా 50 వేల రూపాయలు చెక్కును పెడన నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు హర్షత్ రామ్ కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేయడం జరిగింది. హర్షత్ రామ్ త్వరగా కోలుకోవాలని తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆశిస్తున్నాం. కార్యకర్తలు అంటే జండా మోసే కూలీలు కాదు నా కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ గారు వినుత రీతిలో జనసైనికులకు ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ఆసరాగా క్రియాశీల సభ్యత్వం ను ప్రవేశపెట్టారు. క్రియాశీల సభ్యత్వం కావాలంటే 500 రూపాయలు చెల్లించి సభ్యుడుగా నమోదు అయితే, అనుకోని సందర్భంలో ప్రమాదానికి గురైతే ప్రమాద బీమా కింద 50 వేల రూపాయలు, దురదృష్టవశాత్తు మరణిస్తే 5,00,000 జనసైనికుల కుటుంబం సభ్యులకు ఆసరాగా ఉండటం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. జనసైనికులను తన కుటుంబ సభ్యులుగా చూసుకునే తత్వం పవన్ కళ్యాణ్ గారిది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత బలపరిస్తే ప్రజాపక్షాల నిలిచి ఇటువంటి అనేక అద్భుత కార్యక్రమాలను పవన్ చేపడతారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, పెడన నియోజవర్గం సమన్వయకర్త పంచకర్ల సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరి రామ్, నియోజవర్గ నాయకులు ఎస్ వి బాబు పండమనేని శ్రీనివాస్, మట్ట శివపావని, గూడూరు మండలాధ్యక్షుడు దాసరి ఉమా సాయి, గల్లా హరీష్, ఎర పోతు అయ్యప్ప, ముదినేని రామకృష్ణ, సమ్మెట గణపతి, సమ్మెట చిన్ని, శ్రీరామ్ సంతోష్, పినిశెట్టి రాజు, అబ్దుల్ నజీర్, పుప్పాల పాండురంగారావు, బొమ్మిరెడ్డి భగవాన్, నాగమల్లేశ్వరరావు, మణికంఠ, పిన్నింటి రామయ్య, మట్ట నాని, మరియు పెద్ద ఎత్తున తరకటూరు గ్రామ ప్రజలు, జనసైనికులు పాల్గొన్నారు.