Prakasam: కందుకూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఆవిష్కరణ

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలం లింగసముద్రం గ్రామంలో ఆదివారం తిరుమలశెట్టి కోటయ్య సమాధి దగ్గర ఏర్పాటు చేయబడిన జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్, రాష్ట్ర ప్రథాన కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ మరియు జిల్లా కమిటీ సభ్యులు కందుకూరు పట్టణంలోని బాలికల హైస్కూల్ ప్రక్కన ఉన్న శ్రీ డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కందుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పులి మల్లికార్జున రావుతో కలిసి పూలమాల వేసి అక్కడినుంచి ర్యాలీగా బయలుదేరి బడేవారిపాలెం గ్రామంలో శ్రీ డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి లింగసముద్రం మండలంలో జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.