చొదిమెళ్ళలో జనసేన ఉచిత మెగా వైద్య శిబిరం

  • ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏలూరు నియోజకవర్గం ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ27వ డివిజన్ చోదిమెళ్ళ గ్రామం పెద్ద రామాలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఏర్పడిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏలూరు నియోజకవర్గం ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. అశ్రం హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రజలకు ఉచితంగా బిపి, షుగరు, కంటి పరీక్షలు, కంటి అద్దాలు దంత పరీక్షలు వివిధ రకాల జబ్బులు గుండె సంబంధిత వ్యాధులకు ఈసీజీ, జ్వరాలు కాళ్లు నొప్పులను పరీక్షించి ఎక్సరే స్కానింగ్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ వైద్య శిబిరాలను సందర్శించి ఉచిత వైద్య పరీక్షలు చేయించుకుని, తమ అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, నగర అధ్యక్షులు నగి రెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి మొబిలి శెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, బోండా రాము నాయుడు, సరిది రాజేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కావూరి వాణి, టూ టౌన్ మహిళా అధ్యక్షురాలు తుమ్మపాల ఉమా దుర్గ, 27వ డివిజన్ ఇన్చార్జ్ నాగభూషణం, ఆంజనేయులుటౌన్ ప్రెసిడెంట్ బండి రామకృష్ణ, నాని, రమేష్, జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.