అంచుల వారి పాలెంలో ఇంటింటికి జనసేన

సత్తెనపల్లి నియోజకవర్గం: రాజుపాలెం మండలం, అంచలవారిపాలెం గ్రామంలో ఆదివారం రాజుపాలెం మండల అధ్యక్షులు అలాగే అంచుల వారి పాలెం గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలకు తెలియజేయడానికి సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు అంచుల వారి పాలెం గ్రామంలో ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తూ, నియోజకవర్గంలోని సమస్యలను, గత నాలుగు సంవత్సరాల నుంచి అధికార పార్టీ వారు నెరవేర్చని హామీలు గుర్తు చేస్తూ ప్రజల్లోకి చైతన్యం తేవడం జరిగినది. అలాగే అంచుల వారి పాలెం గ్రామంలో నేటి సమస్యను అలాగే రోడ్ల సమస్యలను జనసేన పార్టీ తరపున పోరాడతామని చెప్పారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో కరెంట్ బిల్లులు చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఈ వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చిమ్మారు. ఆదివారం నుండీ వారాహి రెండో దశ యాత్ర ఈ ఏలూరు నుండి ప్రారంభమవుతుందని, వారాహి యాత్రను విజయవంతం చేయవలసినదిగా కోరుకుంటున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, కౌన్సిలర్, జిల్లా నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగినది.