జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు ఘన సన్మానం చేసిన జనసేన

మైలవరం: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రైతులకు దుశ్సాలువా కప్పి ఘన సన్మానం చేసి వారికి స్వీట్లు అందించిన జనసేన పార్టీ మైలవరం ఇంచార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా వ్యవసాయాన్ని నమ్ముకుని ప్రతిఒక్కరికి తినడానికి తిండిని అందించే రైతు పరిస్థితి ఈరోజు చాలా దయనీయంగా ఉందని, రైతే రాజు అనే పదం కాగితాల వరకే పరిమితం అయింది. నిజంగా రైతుని రాజుగా చేయాలి అంటే ముందు వారు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించాలని, దళారుల చేతిలో నుంచి రైతులను కాపాడాలని, సేకరించిన పంటకు గిట్టుబాటు ధరను త్వరితగతిన ప్రభుత్వం మంజూరు చేయాలని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి నాని, చేరుకుమల్లీ సురేష్, అడపా శివ, రామిశేట్టి ప్రవీణ్, సిరిపురం సురేష్, రాంజనేయులు, యర్రంశెట్టి సాయి, దూడల ఈశ్వర్, యతిరాజుల ప్రవీణ్, వెంకట స్వామి, బాల, సామల శ్రీనివాసరావు, వీర సాయి, కృష్ణ, శివ, సాయి, తదితరులు పాల్గొన్నారు.