అంగర జగనన్న కాలనీలో జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

మండపేట, కపిలేశ్వరం మండలంలోని అంగర గ్రామంలో హైస్కూల్ వద్ద జగనన్న కాలనిలో వర్షం వస్తే ముంపు తప్పదని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జనసేన సోషల్ ఆడిట్ కార్యక్రమం రెండోవ రోజు భాగంగా అంగరలో ఆదివారం నిర్వహించిన జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో ఆయన పాల్గొని సామాజిక పరిశీలన నిర్వహించారు. అనంతరం ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారుల ఇబ్బందులు తెలుసుకుని వారికి న్యాయం జరిగేవరకు జనసేనపార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణానికి చెందిన నిరుపేదలకు 15 కిలో మీటర్ల దూరంలో స్థలం ఇచ్చి అక్కడ వెంటనే నిర్మాణం చేపట్టాలని బెదిరించి కట్టిస్తున్నారని కొందరు దళారులు రాబందుల్లా తయారై లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన మూడో అప్షన్ ఏమైందో తెలియదని దుయ్యబట్టారు. ఖచ్చితంగా ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలోచనా రహిత నిర్ణయం వల్లలే వరి పొలాలు కంటే, అవుట్ పల్లంగా ఉందని మెరక చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. చిన్నపాటి వర్షానికే కాలని మునిగి పోతుందని, భవిష్యత్ లో ఇళ్ళు నిర్మాణం పూర్తి అయితే ఇక్కడ డ్రైనేజీ వాడకంతో కాలని మురికి కూపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొమ్మిశెట్టి సూరిబాబు, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు మేడేపల్లి కనకరామకృష్ణ, కపిలేశ్వరం మండల అధ్యక్షులు తుత్తుపు నాగరాజు, పిల్లా బసవరాజు, కొమ్మిశెట్టి సాయి, సుధ తేజ, చోడపనేడి తేజ సాయి, కంపెళ్ళ రాంబాబు శర్మ, అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *