హుస్నాబాద్ బరిలో జనసేన..!

తెలంగాణ, హుస్నాబాద్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇంచార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే జనసేన పార్టీ యొక్క లక్ష్యం అన్నారు. అంతేకాక నియోజకవర్గంలోని బూత్ స్థాయి కమిటీల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మల్లెల సంతోష్, కొలుగూరి అనిల్, శ్రావణపల్లి శ్రీకాంత్, గుండా సాయి చంద్, మేకల కిషన్, వేల్పుల మధు, రెడ్డి గోపినాథ్, మోరె శ్రీకాంత్, నేవూరి పవన్, కయ్యం సాయి, పైడిపెల్లి అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.