ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తికి అండగా జనసేన

కొత్తపేట మండలం అవిడి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన పందుల సుబాకర్ ను కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ పరామర్శించి.. 5 వేల రూపాయల ఆర్థికసహాయం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ తో పాటు కంఠంశెట్టి చంటి, చోడపనెడి ఉమా, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గనిపూడి చిన్ని, అడపా ఆనంద్, మహా దత్తు బాబ్జి, బండారు రామచంద్రరావు, గాజుల సుబ్బారావు, పప్పుల ఆనంద రాజు మరియు గ్రామ జనసేన కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.