అంబేద్కర్ కు జి సిగడం జనసేన ఘన నివాళి

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరియు సమసమాజాన్ని నిర్మించడానికి జీవితకాలం కష్టపడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా.. జి సిగడం మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఎస్సీ కాలనీలో అ మహనీయుని విగ్రహంకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పులా మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిద్దాం సర్పంచ్ మీసాల రవికుమార్, మండల నాయకులు తాలబత్తుల పైడిరాజు, మీసాల రామకృష్ణ,ఎంపీటీసీ అభ్యర్థి బొల్లు రవికుమార్, చవితి హరీష్, మండ గురయ్య, కొప్పు సింహాచలం, దూసి చంటి, కొన్న సంతోష్, జనసేన, బీజేపీ ప్రాంతీయ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ అభిమాన సంగం ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.