బడుగుబలహీన వర్గాల వారికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: శ్రీమతి రమాదేవి

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వేదగిరివారి పల్లి గ్రామంలోని శింగంశెట్టి వారి హరిజనవాడలో శ్రీ కోదండ రామాలయం కుంభాబిషేకంలో ఐరాల మండలాధ్యక్షులు పురుషోత్తం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ, మండల కమిటీ, మరియు రాయలసీమ రీజనల్ కోఆర్థనేటర్, జిల్లా కార్యదర్శి వారి నేతృత్వంలో జనసేన సీనియర్ నాయకులు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవికి పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానం పలికారు. శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకుని మండలాధ్యక్షులు, మండలకమిటి సభ్యులు మరియు జిల్లా కార్యదర్శితో కలిసి ప్రతేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం శింగంశెట్టి వారి పల్లి హరిజనవాడ సందర్శించి అక్కడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తరువాత శ్రీమతి రమాదేవి మాట్లాడుతూ జనసేన పార్టీ బడుగుబలహీన వర్గాల వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని, ప్రతి గ్రామంలో రామాలయం నిర్మించడం వెనుక ముఖ్య ఉద్దేశం రామ రాజ్యం ధర్మ పాలనతో ఏలా అయితే సుభిక్షంగా ఉంటుందో, జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తే రాష్ట్రం రామరాజ్యంలా సుభిక్షంగా ఉంటుంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ డా.ఆకుల వనజ, మండలాదక్ష్యులు పురుషోత్తం, జిల్లా కార్యదర్శి ఏ.పి.శివయ్య, మరియు మండలకమిటి సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు. అనంతరం బంగారుపాళ్యం మండలంలోని జనసైనికుడు హరీష్ కుమార్ ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలుసుకుని బంగారుపాళ్యం మండలాధ్యక్షుడు కోడి చంద్రయ్యతో కలిసి అతని ఇంటికి వెళ్ళి అతనిని పరామర్శించి అతనికి కొంత ఆర్థిక సాయం అందించి, జనసేన పార్టీ ఎల్లప్పుడూ జనసైనికులకు అండగా ఉంటుందని, మనోధైర్యం కోల్పోవద్దు అని అతనికి శ్రీమతి రమాదేవి ధైర్యం నింపారు, హరీష్ కుమార్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడని తెలుసుకున్న రమాదేవి అతనిని అభినందించి, ఉద్యోగస్తుడు అవ్వాలన్న అతని కలని తనవంతు కృషి చేసి తన కలని నెరవేరుస్తామని రమాదేవి మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ.పి శివయ్య, బంగారు పాళ్యం మండలాధ్యక్షులు కోడి చంద్రయ్య మరియు శివ, పవన్, జనసైనికులు పాల్గొన్నారు.