ఆక్వా రైతుల సమస్యలపై పోరాటానికి జనసేన సిద్ధం: ఎస్.వి.బాబు

పెడన: ఆక్వా రైతుల సమస్యలపై జనసేన పార్టీ పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి.బాబు మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటినుండి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల రైతాంగం అనేక విధాలా నష్టపోతున్నారు. ఆక్వా రైతులయితే దిక్కుతోచని దయానందన స్థితిలో ఉన్నారు. వంద కౌంట్ రొయ్యలు ఉత్పత్తి చేయాలంటే రైతుకు సుమారు 220 నుంచి 240 వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుత మార్కెట్లో 100 కౌంట్ రొయ్యలు 140 నుండి 160 రూపాయలు మాత్రమే పలుకుతారు. దీంతో ఆక్వారైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా ఆక్వా జోనులో లేదంటూ విద్యుత్ సబ్సిడీ ఇవ్వకపోవడం ఆక్వా రైతులకు విద్యుత్ బిల్లులు పెను భారం అయ్యాయి. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి అయితే ఆక్వా రైతులకు యూనిట్ రూపాయికే విద్యుత్ సరఫరా చేస్తారని హామీ ఇచ్చి, ముఖ్యమంత్రి అయిన తర్వాత యూనిట్ 1 కి 4.25 పైసలు వసూలు చేస్తున్న పరిస్థితి. 1800 రూ.ల ఉండే ఫీడ్ బస్తా ధర ప్రస్తుతం 2800 రూ. ల పెరగడం వల్ల పెట్టుబడి పెను భారం అవుతుంది. నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవటం వలన, రైతులు జనరేటర్ ఉపయోగించడం వలన డీజిల్ చార్జీలు మరింత భారం అవుతున్నాయి. ఆక్వా రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆక్వా రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే ఆక్వా రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు ప్రశ్నార్ధకమవుతాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. తీరప్రాంతమైన పెడన నియోజకవర్గం లోని కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ఎక్కువ మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని, హ్యచరిలు, నాణ్యమైన సీడు, ఫీడు, మందులను అందజేయాలని,
ధరల స్థిరీకరణ చేయాలని, విద్యుత్ చార్జీల్లో రాయితీలు అందించాలని, ఆక్వా రైతులు వినియోగించే డీజిల్ పై సబ్సిడీ ఇవ్వాలని జనసేన తరపున ఎస్.వి.బాబు డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వం ఇదే విధమైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఆక్వా రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడి పోరాటం చేయడానికి సిద్ధమని అన్నారు.