తియ్యమామిడి గ్రామస్థులతో సమావేశమైన జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: జనసేన పార్టీ పాడేరు ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య, పార్టీ నాయకులు తియ్యమామిడి, మెట్టపాడు గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుత గిరిజన సమస్యలపై జనసేన పార్టీ నాయకులు రాజిలేనిపోరాటం చేస్తున్నవిషయం, ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలను గురించి ఆదివాసీ ప్రజలకు కలిగిస్తున్న చైతన్యం వంటి విషయాలు తెలియజేస్తూ ప్రస్తుతం ఆ గ్రామస్తులతో వాస్తవ సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ఎటువంటి త్రాగునీటి వ్యవస్థ లేదు, సీసీ రోడ్డు వ్యవస్థలేదు, హౌసింగ్ వంటి పథకాలు ఏవి కూడా ఇంతవరకు మా గ్రామస్తులకు అండలేదన్నారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ నాయకులు స్పందిస్తూ కేవలం ఈ గ్రామంలోనే కాకుండా గిరిజన ప్రాంతమంతా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది ఈ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలఆర్ధిక స్థితిగతులను నిర్వీర్యం చేస్తుందన్నారు. దీనికి సరైన పరిస్కారం కేవలం మన ఓట్లతోనే దొరుకుతుందని తప్పకుండా రానున్న ఎన్నికల్లో పారదర్శకత ప్రజా సమస్యల పరిస్కారం దిశగా ఆలోచన చేసే పార్టీలకు ఓటువెయ్యలన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికి చాలా గ్రామాలకు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ గిరిజన ప్రజలకు వారి సమస్యలకు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేసే జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నిర్దిష్ట్యా లక్ష్యాలు తెలియజేస్తున్నామన్నారు. మొన్న జరిగిన ఒక అగ్నిప్రమాదంలో మత్స్యకారుల బోట్లు దగ్దమయ్యింది అధికారంలో ప్రభుత్వం స్పందించాడానికి ముందే జనసేనాని ఒక్కో బోటుకి 50వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు అధికారంలో లేని నాయకుడి బాధ్యత తీసుకుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం పవన్ కల్యాణ్ గారు ప్రకటించిన ఆర్థికసాయం తీసుకుంటే ప్రభుత్వ సాయం నిలిపేస్తామనడం కూడా చూస్తున్నాం ఇది ప్రస్తుత ప్రభుత్వ తీరన్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీలో గ్రామస్తులందరు మూకుమ్మడిగా చేరారు వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, తాంగుల రమేష్, కొర్ర భానుప్రసాద్, తల్లే త్రిమూర్తులు, దుక్ఖేరి బుజ్జిబాబు, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, మజ్జి సత్యనారాయణ, మజ్జి సంతోష్, తదితర జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.