జాతీయస్థాయి మత్స్యకార సమావేశంలో జనసేన నాయకులు

కాకినాడ, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి మత్స్యకార సమావేశంలో రాష్ట్ర మత్స్యకార సమస్యలను వెలిగెత్తిన కాకినాడ జిల్లా మత్స్యకార అధ్యక్షులైన ఉప్పాడ కొత్తపల్లి మండల జనసేన నాయకులు వంకా కొండబాబు మంగళవారం ఢిల్లీలో జాతీయ స్థాయి మత్స్యకార మీటింగ్ నేషనల్ ప్లాట్ ఫామ్ ఫర్ స్మాల్ స్కేల్ ఫిష్ వర్కర్స్ అధ్వర్యంలో మీటింగు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 17 రాష్ట్రాల మత్స్యకార నాయికులు, మత్స్యకార మేధావులు, సోషల్ వర్కర్స్, హాజరు అయ్యారు. మన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి మత్స్యకార నాయకులు డి. పాల్, నేషనల్ కో- ఆర్డినేటర్ (ఎన్.పి.ఎస్.ఎస్.ఎఫ్.డబ్ల్యు), చింతపల్లి సూర్య నారాయణ, న్యాయవాధి, కోలా బాలాజీ, కృష్ణ జిల్లా అధ్యక్షులు, దోమ ఆదినారాయణ, కోనసీమ జిల్లా అధ్యక్షులు, వంకా కొండబాబు, కాకినాడ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధముగా మంగళవారం మొదట రోజున మత్స్యకారుల హక్కులు కోసం జిల్లా రాజధాని, రాష్ట్ర రాజధాని, దేశ రాజధాని స్థాయిలో మీటింగులు, ఉద్యమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు బాధితులు కోసం, రణస్థలం మండలం, పైడి భీమవరం వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ బాధితుల కోసం, ఎన్.ఏ.సి.ఎల్, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం బాధితుల కోసం, విశాఖపట్నం, రాంబిళ్లి మండలము, వాడ నర్సాపురం నేవీ నిర్మాణం బాధితులు కోసం, అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం, రాజయ్య పేట, దొండవాక, పెద్ద తీనార్ల, చిన్న తీనర్ల దగ్గర ఉన్న హెటెరో డ్రగ్ కెమికల్ ఫ్యాక్టరీ బాధితుల తరుపున, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు బాధితులు కోసం పోరాటం చేయాలని నిర్ణయం. చేపలు పట్టడం లేదా చేపల పెంపకం కోసం ప్రజా నీటి వనరులు లేదా నీటి కామన్స్ (సముద్రం, నదులు, రిజర్వాయర్లు, సరస్సులు, చిత్తడి నేలలు మొదలైనవి) యాక్సెస్ మరియు ఉపయోగించుకునే హక్కు. యాక్సెస్ హక్కులు అంటే చేపలు పట్టడం మరియు చేపల పెంపకం కోసం నీటి వనరులను ఉపయోగించుకునే హక్కు అలాగే యాక్సెస్‌ను ప్రారంభించడానికి భూమి మరియు నీటిపై హక్కు. ఈ హక్కులు తొలగించలేనివి. ముసాయిదా భారతీయ ఓడరేవుల బిల్లు 2022- భారతీయ ఫ్లాగ్డ్ ఫిషింగ్ ఓడల ద్వారా చేపలు పట్టడాన్ని నియంత్రించడానికి ముసాయిదా మార్గదర్శకాలను భారత ప్రభుత్వం తయారు చేసింది. ఎన్.పి.ఎస్.ఎస్.ఎఫ్.డబ్ల్యు ముసాయిదాలో చిన్న తరహా మత్స్యకార సంఘాల జీవనోపాధి హక్కులను గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరియు సాధారణ వాటాదారుల కోసం ముసాయిదా భారతీయ ఓడరేవుల బిల్లు 2022లో సామాన్య మత్స్యకారులను వీధిన పడవేసే పథకాన్ని తిరస్కరించడాన్ని విమర్శించింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆదరాబాదరా వకల్పడు పోర్టు, దొనేపెట్, హిటేరో ఫార్మా, బల్క్ డ్రగ్ పర్కలు, తొండంగి మండలంలో పోర్టు25 బెర్తులుతో, రామాయపట్నం పోర్టులను కట్టడం జరగుతుంది. వీటివల్ల యావత్తు రాష్ట్ర మత్స్యకారులు జీవితాలు వీదిన పడే పరిస్తితి ఉంది. కానీ మన నాయకులు అభివృధి అనే మేడిపండుని చూపించి వేల కోట్లు రూపాయలను నష్ట పరుస్తున్నారు. మనలోని అనైక్యతను ఆసరాగా చేసుకొని క్రొత్త పోర్టులు తీసుకొస్తున్నారు. కానీ ఈ నాయకులు ఎవ్వరూ కూడా ఈ పోర్టులు కట్టిన తరువాత నష్టాలు పాలు అయితే దానికి మమ్మల్ని ఏ శిక్ష వేసినా అంగీకరిస్తాం అని చెప్పలేరు, కారణం ఉదాహరణకు మన రాష్ట్రంలో ఈ మధ్యనే కట్టిన కృష్ణ పట్నం పోర్టు దానికి ఉదాహరణ. ఒకవేల అభివృద్ధి అయితే కృష్ణ పట్నం పోర్టుని ఎందుకు అమ్మవాల్సి వచ్చింది చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది.