కందుల దుర్గేష్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

రంపచోడవరం నియోజవర్గం: జనసేన పార్టీ టిడిపి సమన్వయ కమిటీ సభ్యులుగా నిమితులయిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ను శనివారం జనసేన నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించి, పువ్వుల బొకే ఇచ్చి మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, రంపచోడవరం మండలం అధ్యక్షులు పాపోలు శీను, రాజవొమ్మంగి మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి త్రిమూర్తులు, అడ్డతీగల మండలం నాయకులు కుప్పాల జయరాం, ఏటుపాక మండల అధ్యక్షులు గంగాధర్వి ఆర్ పురం మండల అధ్యక్షులు సాయి కృష్ణ, కూనవరం మండల అధ్యక్షులు నరేంద్ర, దేవీపట్నం మండల అధ్యక్షులు సారపు రాయుడు, గంగవరం మండలం కుంజు సిద్దు, సాయి లోకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.