గంధం మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

కొండేపి నియోజకవర్గం: సింగరాయకొండలో శ్రీ శ్రీ శ్రీ మహబూబ్ సుభానీ గంధ మహోత్సవంలో గురువారం సాయంత్రం జనసేన నాయకులు పాల్గొని, రాష్టంలో ప్రజలకోసం నిరంతరం నిజాయతీగా శ్రమించే కొణిదల పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెయ్యాలని, అల్లా ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు అల్లా ఆశీస్సులు ఉండాలని జనసేన పార్టీ నుండి దువా చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశి భూషణ్, సింగరాయకొండ మండల ఉపాధ్యక్షులు సయ్యద్ చానాభాష, అధికార ప్రతినిధి సంకె నాగరాజు, మరియు ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శులు అనుమలశెట్టి కిరణ్, కిచ్చెంశెట్టి ప్రవీణ్ కుమార్, ప్రచార కార్యదర్శిలు తగరం రాజు, షేక్ సుల్తాన్ భాష, మండల కమిటీ సభ్యులు శీలం సాయి, సయ్యద్ సుభాని, కూతల శ్రీనివాసరావు, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.