అయితాబత్తులకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

అమలాపురం నియోజకవర్గం కూటమి జనసేన, టిడిపి, బీజేపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుకు నియోజకవర్గంలో జనసేన పార్టీ నుండి గెలుపొందిన పంచాయతీ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు పంచాయతీ వార్డు మెంబర్లు, అమలాపురం పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన సమావేశంలో మద్దతు తెలియజేశారు. కూటమి అభ్యర్థి ఆనందరావు మాట్లాడుతూ అమలాపురంలో జనసేన ఎమ్మెల్యే గెలిస్తే జనసేన కార్యకర్తలకు ఎంత న్యాయం జరుగుతుందో ఆనందరావు గారు గెలిచినా జనసేన కార్యకర్తలకు కూడా అంతకుమించి న్యాయం జరుగుతుంది అని ఆయన అన్నారు. తాను గెలిచిన తరువాత తెలుగుదేశం కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా సమాన అవకాశాలు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ పార్లమెంటు గౌరవ అధ్యక్షులు నల్లా శ్రీధర్, లింగోలు పండు, ఆకుల బుజ్జి, అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ సతీష్, ఆకుల సూర్యనారాయణ మూర్తి, గండి స్వామి, చిక్కం భీముడు, పిండి రాజా ఇసుక పట్ల రఘుబాబు, అయితబత్తుల ఉమామహేశ్వర రావు, పార్టీ నాయకులు, జనసైనికులు వీరమహిళలు భారీఎత్తున పాల్గొన్నారు.