నర్సాపురంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం

  • జనసైనికుల కుటుంబాలకు భీమా చెక్కులు అందజేత
  • మనోహర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం నియోజకవర్గంలో ప్రమాదాలకు గురైన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద భీమా చెక్కులు అందజేయడానికి నరసాపురం విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ కి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు ఏక్సిడెంట్ కి గురై మరణించిన వేములదీవి వెస్ట్ గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త ఉంగరాల ఏడుకొండలు గారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును మరియు ప్రమాదవశాత్తు ఏక్సిడెంట్ కి గురయ్యి గాయాలపాలైన అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త గొర్ల వీరన్నకి 50 వేల రూపాయల ప్రమాద భీమా చెక్కులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం నాదెండ్ల మనోహర్, బొమ్మిడి నాయకర్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనోహర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఒక్క వ్యవస్థ కూడా సరిగ్గా లేదని తెలిపారు. ముఖ్యంగా హెలికాప్టర్ లో తిరిగే ముఖ్యమంత్రి రోడ్డు మీద తిరిగితే ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల వ్యవస్థ ఎలా ఉందో తెలిసేది అని అన్నారు. ఈ ప్రభుత్వానికి 2024లో ప్రజలే బుద్ధి చెప్తారు అని తెలిపారు. అనంతరం సీతారామపురం సౌత్ గ్రామం నుండి టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన దాదాపుగా 50 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై నరసాపురం ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మరియు పిఏసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ ల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అద్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు), ఘంటసాల వెంకటలక్ష్మి, రెడ్డి అప్పలనాయుడు, విడివాడ రామచంద్రరావు, పత్సమట్ల ధర్మరాజు, సువర్ణ రాజు, చెనమల్ల చంద్రశేఖర్, కాట్నం విశాలి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.