ఎంటిటిపిఎస్ చీఫ్ ఇంజినీర్ అశోక్ రెడ్డి కి వినతిపత్రం ఇచ్చిన జనసేన ఎంపీటీసీ

*మరొకసారి తుమ్మలపాలెం విటిపిఎస్ కెనాల్ వంతెనలపై మరియు విటిపిఎస్ ప్రభావిత ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణపై తన గళం వినిపించిన పోలిశెట్టి తేజ

ఎంటిటిపిఎస్ వేదికగా కాలుష్య నివారణే ప్రధాన ధ్యేయంగా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి పాలడుగు జ్యోష్ణా అధ్యక్షత వహిస్తూ…గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన సమావేశంలో.. మండలంలోని ఎంటిటిపిఎస్ నుంచి వెలువడే బూడిద వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని..దానికి పరిష్కారా మార్గాలు చూడాలని కోరుతూ…పార్టీలకు అతీతంగా మండలంలోని కాలుష్య ప్రభావిత గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మీడియా మిత్రులు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎంటిటిపిఎస్ చీఫ్ ఇంజినీర్ అశోక్ రెడ్డి కి వినతిపత్రాన్ని అందచేయడం జరిగింది. తుమ్మలపాలెం గ్రామ ప్రధాన సమస్య అయిన కెనాల్ వంతెన పునర్నిర్మాణం గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన.. ఎంపీపీ శ్రీమతి పాలడుగు జ్యోష్ణా గారికి మరియు మా గ్రామ సమస్యలను విని సానుకూలంగా స్పందించిన ఎంటిటిపిఎస్ చీఫ్ ఇంజినీర్ శ్రీ అశోక్ రెడ్డి గారికి పోలిశెట్టి తేజ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.