కోత్తకుంకాం గ్రామంలో రైతులు పక్షాన జనసేన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం కోత్తకుంకాం గ్రామంలో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు కోత్తకుంకాం పంచాయితీ యంపిటిసి అభ్యర్థి వడ్డిపిల్లి శ్రీనువాసరావు ఆధ్వర్యంలో ఆదివారం రైతులకు నష్టపరిహారం ఇంతవరకు మాగ్రామాలకు అందలేదు. రైతులకు అందనయెడల ఆగ్రామ రైతులు పక్షాన అండగా నిలబడాలని వడ్డిపిల్లి శ్రీనువాస్ రావు అలాగే జనసేనపార్టీ నాయకులు హితువు పలికారు. రైతులకు తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి అందే సహాయం అందించకపోతే వడ్డిపిల్లి శ్రీనువాస్ రావు సచివాలయం ముందు రైతులు కోసం నిరాహార దీక్ష కార్యక్రమం చేపడతానని అయిన మాట్లాడారు. ఆగ్రామ రైతులు సమస్యలు జనసేనపార్టీ నాయకులుకు విన్నవించారు ఈసమస్యను తీర్చే విధంగా మేము మా జనసేనపార్టీ తరుపున మాట ఇస్తున్నాం ఈసమస్య తీర్చేంతవరకు జనసేనపార్టీ ఎంతవరకు అయిన బాధ్యత తీసుకుంటుంది అని అలాగే పోరాటం చెయ్యాడాని మేము రైతులు పక్షాన ఉన్నాము అని జనసేనపార్టీ నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి.సిగడాం మండలం జట్పిటీసి అభ్యర్థి భూపతి అర్జున్, జై.సిగడాం మండలం నిద్దాం పంచాయితీ జనసేనపార్టీ సర్పంచ్ మీసాలు రవి జి.సిగడాం మండలం జనసేన నాయకులు మీసాల రామకృష్ణ, లావేరు మండలం అప్పాపురం, పంచాయతీ యంపీటిసి అభ్యర్థి అదపాక అప్పలరాజు రణస్థలం మండలం నాయకులు దన్నాన చిరంజివి, రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు అలాగే జనసైనుకులు సాయి, సంతోష్, రాము గ్రామ రైతులు లక్ష్మీనారాయణపురం కూనపిల్లి దాసు, దుంబుడు బియ్యపు కాశీలు, పన్నట్ల చిట్టిబాబు, ఇజ్జిపేట కోల నారాయణరావు, కోల జగన్నాథం, కోత్తకుంకాం గ్రామ కూనపిల్లి మురళీ, మచ్చ సంతోష్, పైడియ్య వలస గ్రామ పల్లి అప్పలనాయుడు, చీరికట్ల సూర్యరావు మహిళలు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.