మత్స్యకారుల సమస్యలపై జనసేన పిఏసి సభ్యులు పితాని మీడియా సమావేశం

డా.బి ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పీఏసీ సభ్యులు నియోజకవర్గ ఇంచార్జ్ ఆధ్వర్యంలో మత్స్యకారుల సమస్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు మత్స్యకారుల సమస్యలపై పోరాడేందుకు మత్స్యకారులకు బాసటగా కార్యక్రమం చేపట్టామన్నారు.
వేటనిషేదం సమయంలో మత్స్యకారులకు ఇవ్వవలసిన‌ పదివేల రూపాయలను అర్హులైన అందరికీ సక్రమంగా సకాలంలో అందచేయాలి. అగ్నికుల క్షత్రియుల వాడ బలిజలతోపాటుగా వేటపై జీవించే వారందరికీ వేట నిషేధ సమయంలో 10 వేల రూపాయలు పరిహారం‌ అందచేయాలని అన్నారు. ఈ భృతి కోసం కేటాయించిన రూ.500 కోట్లు లెక్కల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అర్హులకు మాత్రం చేరడం లేదు. డీజిల్ రాయితీ విషయంలో నెలకొన్న సాంకేతిక సమస్యలు, మౌలికమైన ఇబ్బందులను తక్షణం తొలగించాలి. మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతిచెందితే వారికి ఇవ్వవలసిన పది లక్షల రూపాయలకు బదులు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని అన్నారు. ఈనెల 28 వ తేదీన ఏటిమొగ ప్రాంతంలో జనసేన పార్టీ ఆద్వర్యంలో మత్సకారులకు బాసటగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని జనసేన కార్యకర్తలకు, అభిమానులకు పితాని బాలకృష్ణ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గొలకోటి వెంకన్నబాబు, మోకా బాలప్రసాద్, మద్దింశెట్టి పురుషోత్తం, అత్తిలి బాబురావు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.