జిల్లా ఉత్తమ పంచాయతీ గోడితిప్ప సర్పంచ్ శ్రీదేవిని సత్కరించిన శెట్టిబత్తుల రాజబాబు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురండా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గోడితిప్పి గ్రామ పంచాయతీ “పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాదుల గ్రామం”గా అమలులో జిల్లా ఉత్తమ పంచాయతీగా (ద్వితీయ స్థానం) అవార్డు అందుకుంది. జనసేన పార్టీ గోడితిప్ప గ్రామ సర్పంచ్ “చిట్నీడి శ్రీదేవి శ్రీనివాస్”ను అమలాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు సర్పంచ్ స్వగృహంలో వారిని సన్మానించి అభినందనలు తెలియజేశారు. అల్లవరం మండలంలో అనేక పంచాయతీలు ఉన్నా జనసేన పార్టీ సర్పంచ్ గా ఉన్న గోడితిప్ప గ్రామానికి జిల్లా స్థాయిలో అవార్డు రావడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మోకా బాలయోగి, కంకిపాటి వీరబాబు, చెవల వెంకటేశ్వర్లు, రొక్కాల నాగేశ్వరరావు, సుధా చిన్న, పిల్లా ప్రసాద్, వంగానాయుడు, కంకిపాటి సుబ్బారావు, వర్రేసూరిబాబు, పొనకల ప్రకాష్ తదితరులు కూడా అభినందనలు తెలియజేశారు.