కావలి టౌన్ లో అంబేద్కరుకు ఘననివాళులు అర్పించిన జనసేన

డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 65 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 6, 1956న కన్నుమూశారు. 2023లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారతదేశ సామాజిక మరియు రాజకీయ దృశ్యాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన దూరదృష్టి గల నాయకుడి జీవితం మరియు సేవలను జనసేన పార్టీ తరుపున స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన కావలి అధికార ప్రతినిధి రిషికేష్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అద్యక్షుడు జనసేన నాయకుడు ఆలా శ్రీనాథ్, పట్టణ ఉపాధ్యక్షుడు నాగార్జున, మాట్లాడుతూ ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి జనసేన పార్టీ తరుపున ఇక్కడి వచ్చి వారికి పూలమాలవేసి నివాళులు అర్పించామని, పవన్ కళ్యాణ్ వీరి ఆశయాలలో ముఖ్యమైనది రాజ్యాధికారం అన్ని వర్గాలవారికి చేరువ కావాలి అనే సంకల్పంతో ఓటుహక్కు మన ఆయుధం అని పార్టీ స్థాపించారు అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమములో బొడ్డు మాల్యాద్రి, లేటి సురేష్, జ్యోతి ప్రభాకర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్, జనసేన అధికార ప్రతినిధి మన్నేపల్లి రిషికేష్, గుంటపల్లి కృష్ణయ్య, మల్లికార్జున, ప్రవీణ్, నాగార్జున, జాన్, జిలాని, షమ్మీ, రమణయ్యలు తదితరు పాల్గొన్నారు.