జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు & ఆత్మకూరు నియోజవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు&సంగం మండల సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్(ఎన్.ఆర్.ఐ), జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు దాడి భానుకిరణ్, దువ్వూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోకల శ్రీధర్ ల సహకారంతో నిరుపేద కుటుంబాలకు కష్టం వస్తే ఆదుకునే పార్టీ జనసేన పార్టీ అనే నినాదంతో సోమవారం సంగం మండలంలోని సిద్దిపురం అనసూయ నగర్ గ్రామపంచాయతీ నందు తాండ్ర లక్ష్మయ్య నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు ఆత్మకూరు నియోజవర్గ జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు & ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు దాడి భాను కిరణ్ చేతుల మీదుగా అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకులు & సంగం మండల చిరంజీవి యువత అధ్యక్షులు అత్తిపాటి కృష్ణమోహన్, జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లు, గండవరపు వెంకటేష్, సురేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొనడం జరిగినది.
Share this content:
Post Comment