ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని ఇవ్వాలని జనసేన నిరసన

పెందుర్తి నియోజకవర్గం, 88 వ వార్డు నరవ నుండి కొత్తపాలెం వెళ్లే రహదారి చర్చి వద్ద గెడ్డ వాగును ఆక్రమణ చేయడం వల్ల రోడ్డుపై నీరు చేరి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతంగా ఉంటుందని, పైనుంచి నీరు కిందికి వెళ్లడానికి గెడ్డవాగు ఉండేదని, ఇప్పుడు భవన నిర్మాణాలు లేఔట్ లు డెవలప్ చేయడం వల్ల కొంతమంది ఆక్రమదారులు గెడ్డవాగును మూసి వేయడం వల్ల నీరు రోడ్డుపై నిలువ ఏర్పడి చెరువుని తెలిపిస్తుందని, ఈ రహదారి సబ్బవరం మండల ప్రజలకు సుమారు నరవ పరిసర 16 గ్రామ ప్రజలకు గోపాలపట్నం వెళ్ళడానికి ప్రధానమైన రహదారి ఇటువంటి రహదారిపై ఈరోజు నీరు చేరడం వల్ల వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురై యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని, ఈ యొక్క గెడ్డవాగు ఆక్రమదారులకు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రభుత్వ అధికారులు తోడ్పాటు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ రోడ్డుకి ఈ దుస్థితి ఏర్పడ్డదని, వెంటనే ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ చొరవ తీసుకొని ప్రజలకు సురక్షితమైన రహదారిని ఏర్పాటు చేయాలని లేనియెడల భవిష్యత్తులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరింత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలాగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని మాట్లాడడం జరిగింది, ఈ కార్యక్రమంలో గవర శాస్త్రి, ప్రవీణ్, రాము, అప్పలరాజు, శివ, అప్పలనాయుడు, తేజ, ప్రసాద్ మరియు జనసైనికులు, ప్రజలు పాల్గొన్నారు.