శ్రీ సాయి వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కర్నూలు నగరంలోని శ్రీ సాయి వృద్ధాశ్రమంలో 73 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ కర్నూలు నాయకులు మహబూబ్ బాషా హసీనా బేగం ఆధ్వర్యంలో కర్నూలు 32వ డివిజన్ జనసేన ఇంచార్జీ సుధాకర్, కర్నూలు జనసేన నాయకులు హసీనా బేగం మహబూబ్ బాషా కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రచనను 1949 నవంబరు 26న సమర్పించారు. దాన్ని ఆమోదించిన భారత ప్రభుత్వం 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది అని పేర్కొన్నారు. అప్పటినుంచి ఆ రోజును రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాం అని తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు, ఓటు హక్కు, జీవించే హక్కు, సమానత్వ హక్కు ఇలా ప్రజల కోసం ఎన్నో హక్కులను అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. అంబేద్కర్ లేకుంటే అసలు భారత రాజ్యాంగమే లేదు. భారత రాజ్యాంగం లేకుంటే ఈ రాజ్యమే లేదు. కానీ ప్రభుత్వాలు, పాలకులు పౌరసమాజం రిపబ్లిక్ డే వేడుకల్లో కొన్నిచోట్ల అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టకుండా విస్మరిస్తున్నారు అని అన్నారు.
కర్నూలు జనసేన మహిళ నాయకురాలు హసీనా బేగం మాట్లాడుతూ అయిన వాళ్ళు అందరూ ఉన్న ఎవరూ లేని అనాధలలాగా వృద్ధాశ్రమాలలో బ్రతుకులు సాగదీస్తున్న వృద్ధుల మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. ఇటువంటి వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం అంటే మన కోసం మన భవిష్యత్తు కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అని అన్నారు. మన దేశాన్ని దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని యువత ఇందుకు ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ బలపడాలని ఆకాంక్షించారు.ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పిస్తూ రక్షణగా నిలిచిన మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నారు అని అన్నారు. రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయితే అది ప్రజలకు తీరని నష్టం చేసినట్లే అని రాజ్యాంగం నియమాలు అపహాస్యం అవుతున్న వేళ ప్రతి ఒక్కరూ తమ హక్కుల ఈ సాధన కోసం బాధ్యతగా ఉద్యమించాలని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగినప్పుడు అందరికీ సమాన అవకాశాలు దక్కుతాయని భావించిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యన్ని నిర్మించాలనే సదుద్దేశంతో 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి, ఎన్నో నిద్ర లేని రోజులు గడిపి భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండల్, మేరీ, విజయమ్మ, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.