జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లాలి: దొడ్డిగర్ల సువర్ణరాజు

గోపాలపురం నియోజకవర్గం: ద్వారకాతిరుమల మండలంలో గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు ద్వారకాతిరుమల మండల జనసేన సభ్యులతో సమావేశమయ్యారు. గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారి ఇరువురి సంయుక్త నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టేలా ఉమ్మడి సిద్ధాంతాల ప్రణాళికను ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా ప్రతి గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీలు కృషి చేయాలి. అలాగే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జనసేన స్థూపాన్ని నిర్మించేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు పర్యవేక్షణలో నాలుగు మండలాల మండల మరియు గ్రామ కమిటీలు పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండల అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు తరగళ్ల శ్రీనివాస్, ఫణి, శివ, పవన్, వీరేంద్ర, నాగశ్రీను, అంజనీకుమార్, ప్రకాష్ రాజు, శివకృష్ణ, శ్రీనివాస్, సురేష్ తదితర జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే త్వరలో గోపాలపురం నియోజకవర్గ కేంద్రమైన గోపాలపురంలో జనసేన పార్టీ విసృత సమావేశం జరుగును. దీనికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు విచ్చేయుచున్నారు. జిల్లా నలుమూలల నుండి ఈ విసృత సమావేశానికి పార్టీ పెద్దలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. కాబట్టి జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విసృత సమావేశం తర్వాత గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంటింటికీ కార్యక్రమం మరియు ప్రతి గ్రామంలో జనసేన పార్టీ స్థూపం నిర్మించుట మరియు నియోజకవర్గంలోని పార్టీ పెద్దలను, అభిమానులను, శ్రేయోభిలాషులను నిత్యం కలిసి పార్టీ గురించి ప్రజలకు తెలియజేయాలని నిశ్చయించారు.