కరెంటు ఛార్జీలకు నిరసనగా పార్వతీపురం రెవిన్యూ డివిజన్ లో జనసేన వినతిపత్రం

పార్వతీపురం, రాష్ట్రంలో అమాంతంగా పెంచేసిన కరెంటు ఛార్జీలకు నిరసనగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు, శుక్రవారం పార్వతీపురం రెవిన్యూ డివిజన్ లో గల సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు, ప్రజలందరి తరపున నిరసన తెలియజేసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, చందక అనిల్, దాలినాయుడు, గోవిందమ్మ, మణి, గణేష్, స్వామి నాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.