జగనన్న కాలనీల పేరుతో గిరిజన ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ప్రభుత్వం

జి.మాడుగుల\చింతపల్లి: వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన జగనన్న కాలనీల విషయమై గత మూడు రోజుల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ ఆడిట్ చేయాలని పిలుపునిచ్చిన మాట విదితమే. అయితే జగనన్న కాలనీల పరిస్థితి అల్లూరి జిల్లాలో ఇంకా విచిత్రమైన స్థితిలో ఉందని జనసేన పార్టీ నాయకులు క్షేత్రస్థాయి పర్యటన చేస్తూ వాస్తవాలు వెలికితీస్తున్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ నాయకులు చింతపల్లిలో జగనన్న లే అవుట్ కాలనీల నిర్మాణం చేపట్టే స్థలాన్ని సందర్శించారు. అయితే అక్కడ ఒక్క ఇటుకతో పునాది వేసిన పాపాన పోలేదు నిర్మానుష్యంగా ఉన్న కాళీ స్థలం మాత్రమే ఉంది. అలాగే జి.మాడుగుల మండలం చిన్నబంధవీధి, కొక్కిరపల్లి గ్రామాలను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. జనసేన పార్టీ నాయకులతో మాట్లాడిన లబ్ధిదారులు మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా ఇళ్లు మంజూరు చేసిన విషయం నిజమే కానీ ఇంకా సంపూర్ణాంగా బిల్లులు అవ్వలేదు, పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇచ్చిన ఇళ్లులను కూడా జగనన్న గృహపధకమని అసత్యాలు పలుకుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు గడప, గడపకి ప్రభుత్వమంటూ మా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిగారు మా ఊరు సందర్శించినప్పుడు మేము మా గృహా నిర్మాణాలకు బిల్లులు అయ్యేటట్టు చూడండని చెప్తే ఎమ్మెల్యే గారు నిధులు లేవని సమదానమిచ్చారని తెలిపారు. ఈ విదంగా జగనన్న కాలనీల పేరుతో అమాయక గిరిజన ప్రజలను మభ్యపెడుతూ ఏ విదంగా గడప, గడప ప్రభుత్వమని వెళ్తున్నారో అర్థం కావట్లేదని, చింతపల్లి మండలంలో గురుకుల జూనియర్ కళాశాల పక్కన జగనన్న కాలనీ కోసం స్థలం అయితే కేటాయించారు కానీ ఎటువంటి నిర్మాణం చేయకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వ పాలన ఎలా వుందో అర్థం చేసుకోవచ్చని, పేదోడి కల స్వగృహం నిర్మాణమని కానీ వైసీపీ నేతలకు అదికూడా పట్టదని మాట్లాడితే చాలు 175/175 అంటారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, కార్యనిర్వాహక అధ్యక్షులు తాంగుల రమేష్, జి మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, అంకిత్, అఖిల్, చింతపల్లి మండల సోషల్ మీడియా కన్వీనర్ చెట్టి స్వామి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.