జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా పూతలపట్టు జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా ఆదివారం మంగళగిరిలో దీక్ష చేస్తున్న సందర్భంగా.. చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీ పసుపులేటి హరి ప్రసాద్ ఆదేశాల మేరకు ఐరాల మండల కేంద్రంలో దీక్ష చేసి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, పూతలపట్టు నియోజకవర్గ జనసేన నాయకులు మైలారు కిశోర్, మట్టపల్లి మునిరాజు, వినయ్, ముని కృష్ణ, ద్వారక తదితరులు పాల్గొన్నారు.