జి. సిగడాంలో మండలం జనసేన ప్రజాబాట 4వ రోజు

ఎచ్చెర్ల నియోజకవర్గం, జి. సిగడాం మండలం వాండ్రాంగి పంచాయతీ చీడిపేట కాలనీలో నాల్గవ రోజు ప్రతి ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులు మరియు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు తెలియజేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తుంటే విశేష స్పందన వస్తుంది. గ్రామాల్లో మహిళలు, యువత, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్ ఏదైనా సరే గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి, కోరాడ రమేష్, చిత్తిరి కృష్ణ, చిత్తిరి చంద్రరావు, మల్లేష్, కె.సంతోష్, అరసవిల్లి రాము మరియు వాండ్రంగి గ్రామం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.