వట్టిచెరుకూరు మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు ప్రత్తి భవన్నారాయణ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-10-at-5.39.03-PM-1-1024x766.jpeg)
వట్టిచెరుకూరు మండలంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ ప్రత్తి. భవన్నారాయణ సోమవారం మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి జనసేన పార్టీ బలోపేతం కోసం తగు సూచనలు, సలహాలు చేశారు, మరియు పార్టీ మండల, గ్రామ కమిటీల గురించి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మండలంలోని కొర్నేపాడు, అనంతవరప్పాడు, సౌపాడు, కారంపూడిపాడు, ముట్లూరు గ్రామాలలో భవన్నారాయణ పర్యటించి మండల, గ్రామ కమిటీల నియామానికి పలు నిర్ణయాలు తీసుకున్నామని భవన్నారాయణ తెలియచేసారు. ఈ పర్యటనలో ఆయా గ్రామాల జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-10-at-5.39.04-PM-1-1024x461.jpeg)