కాపు నేస్తం వేదికపై సీఎం వ్యాక్యలను ఖండిస్తూ జనసేన ప్రెస్ మీట్

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో జరిగిన వైయస్సార్ మూడవ విడత కాపు నేస్తం కార్యక్రమంలో భాగంగా సభా వేదికపై మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు ఇతర శాఖల మంత్రులు జనసేన పార్టీ మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలకు దీటుగా, వారు మాట్లాడిన మాటలను ఖండిస్తూ, శనివారం పిఠాపురం పట్టణం నందు జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల మహిళ రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి కాపులను విమర్శిస్తుంటే నవ్వుకుంటూ చోద్యం చూస్తున్న వైసిపి మంత్రులను ఉద్దేశించి ఒక కాపు సోదరిగా సిగ్గుపడుతున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పేరు జనసేన పార్టీ ప్రస్తావన లేకుండా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమము గానీ, మీడియా సమావేశాలు గానీ జరగవని, జనసేన పార్టీ ఉనికి పెంచుకోవడానికి వైసిపి ప్రభుత్వం ప్రచారవాణిగా పని చేస్తుందని హేళన చేశారు.
తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పైన వైసిపి మంత్రుత్వ శాఖ పైన పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణలు చేసినవారిపై నిప్పులు జరిగారు. గొల్లప్రోలు కాపు నేస్తం బటన్ సభకి అయిన ఖర్చుతో నియోజకవర్గంలో గుంతలు ఏర్పడిన అన్ని రోడ్లు మరమ్మత్తులు చేయవచ్చునని వైసిపి ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మత్సకార కార్యదర్శి కంబాల దాసు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కాపులను ఉద్ధరిస్తుంది అని చెప్పుకుంటుంది, కానీ వైసీపీ ప్రభుత్వం కాపులనే కాదు అన్ని కులాల్ని కూడా మోసం చేసిందని ఎద్దెవ చేసారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వెన్న జగదీష్ మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమానికి కాపు నేస్తం అనే బదులుగా, కాపు ద్రోహం అని పేరు పెట్టుంటే బావుండును, సరిగ్గా సరిపోను అని గెద్దేవా చేయడమే కాకుండా పలు అంశాల పైన వైసిపి ప్రభుత్వం పనితీరుపైన ప్రశ్నించారు.

చివరిగా విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కాపులపై చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, కాపులు అమ్ముడుపోయేవారు కాదని, మోసపోయేవారు అని, అదేవిధంగా కాపులు పల్లకి మోసే వారు మాత్రమే కాదు, కచ్చితంగా 2024 తర్వాత పల్లకి ఎక్కే వారు అని నిరూపించుకుంటారని సవాల్ విసిరారు.

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కందరాడ జనసేన పార్టీ ఎంపీటీసీ పిల్ల సునీత, వీర మహిళ రమ్య జ్యోతి, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ నాయకులు బాలిపెల్లి అనిల్, వేల్పుల చక్రధర్ రావు, పల్నాటి మధు, బొజ్జా కుమార్,బుర్రా సూర్యప్రకాష్ రావు..
పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బాపన్న దొర, ఎం. రాజు, పిల్లా వెంకట దినేష్, రాసంశెట్టి సూరిబాబు, గంజి గోవిందరాజు, సూర్యప్రకాష్, బాబ్జి, చక్రయ్య, పెనుబోతుల చక్రి, ఇస్సాకు, కృష్ణంరాజు ఇశ్రాయేలు, జనసైనికులు పాల్గన్నారు….
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు వీర మహిళలకు మీడియా మిత్ర బృందానికి పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.