పిట్టపాలెం గ్రామం రోడ్ల దుస్థితిపై జనసేన నిరసన

  • షేర్ ఆటో డ్రైవర్లుకు వణుకు పుట్టిస్తున్న రోడు .. అడుగడుగు కు గుమ్ములు.. గుమ్ముల్లో రోడు వెతుక్కోవాలి

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, రణస్థలం పంచాయతీ, పిట్టపాలెం గ్రామం రోడ్ల దుస్థితిపై జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు డా. విష్వక్సేన్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా.. నాయకులు మారినా ఈ రోడ్డు వేసే నాధుడు లేడు. ఆటోలు కూడా తిరగని దుస్థితి. ప్రజలు ప్రశ్నిస్తే కుల దూషణలు.. 15 రోజుల్లో ఈ రోడ్డు మరమ్మత్తులు చేయాలని డా. విష్వక్సేన్ లోకల్ ఎమ్మెల్యే ను హెచ్చరించారు. లేని పక్షంలో జనసేన పార్టీ నుంచి శ్రమదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.