సింగరాయకొండ ట్రంక్ రోడ్డు దుస్థితిపై జనసేన నిరసన

కొండెపి: ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ ట్రంక్ రోడ్డు సౌత్ బైపాస్ నుండి నార్త్ బైపాస్ వరకు గత సంవత్సర కాలంగా రోడ్డు గుంతల పడి అద్వానంగా ఉండడంతో.. సమస్యపై స్పందించిన జనసేన నాయకులు ఆర్ అండ్ బి అధికారులు దృష్టికి తీసుకువెల్లి జనసేన పార్టీ నుండి వినతి పత్రం ఇవ్వడమైనది. ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాడుతూ నాడు గ్రామపంచాయతీ వారు నాలుగు రాళ్ల ముక్కలు వేసి చేతులు దులుపుకొని మరమ్మత్తులు చేశామని పేపర్లకే పరిమితంచేసారు, చేసిన రెండు నెలల వ్యవధిలోనే మళ్లీ యధావిదంగా రోడ్లు గుంతలమైపోవడం జరిగినది. నేడు దీనిని జనసేన పార్టీ ఆద్వర్యంలో సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శిని వివరణ అడగగా ఆర్ అండ్ బి అధికారులు తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు అని, గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ కుమార్ గారు చెప్పడం సిగ్గుచేటు, నాడు గ్రామపంచాయతీ వారు నాలుగు కంకర ముక్కలు వేసుకొని బిల్లు పెట్టుకునీ, జేబులో డబ్బులు వేసుకున్నారా…? అని ప్రజలు కూడా వారి సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది అవినీతి కాదా అనీ జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. జనసేన పార్టీ సంబంధింత విషయాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వటం జరిగినది. సుమారుగా ఈ అర్జీ ఇచ్చి రెండు నెలలు కావస్తున్నప్పటికీ దీనిపైన స్పందన లేకపోవడం. ప్రతిరోజు ప్రజలు ఎవరో ఒకరు ఈ గోతుల్లో పడి గాయాలు పాలై హాస్పిటల్ పోవడం జరుగుతుంటే.. వైసిపి నాయకులు, ప్రభుత్వ అధికారులు నిత్యం చోద్యం చూస్తూన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా స్పందన లేకపోవడం సింగరాయకొండ మండల ప్రజల పాలిట శాపంగా మారిందని ప్రజలు వారి ఆవేదన జనసేన పార్టీ వద్ద వ్యక్తపరుస్తున్నారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ గారికి ఇచ్చిన అర్జీకే స్పందన కరువు అవటం ఈ వైసీపీ ప్రభుత్వ అసమర్థత పాలనకి అద్దం పట్టినట్లుగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. వారం రోజుల్లో రోడ్లు మరమ్మత్తులు చేపట్టకపోయినట్లయితే నిరాహారదీక్ష సైతం జనసేన పార్టీ సిద్దంగా ఉందని హెచ్చరించడం అయినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు కాసుల శ్రీకాంత్, జనసేన నాయకులు కాసుల శ్రీనివాస్, అనుముల శెట్టి కిరణ్ బాబు, సంకే నాగరాజు, కేశవరావు, శీలం సాయి, సుల్తాన్ భాష, కరుణ్ కుమార్, కే శ్రీను, వినయ్ కుమార్, అనీల్, నాగరాజు, డేవిడ్, మహేంద్ర, ప్రవీణ్, కళ్యాణ్, సునీల్, గోపి, సందీప్ జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.