నిరుపేద మహిళ ఇంటి నిర్మాణం కోసం జనసేన నిరసన ర్యాలీ

  • కాశి తోట నుండి కార్వేటి నగరం సముదాయం వరకు నిరసన ర్యాలీ
  • నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం వర్తింప చేయాలని పొర్లు దండాలు
  • స్వామి అసమర్ధుడని తెలుస్తోంది
  • అందుకే ఇంతటి వ్యతిరేకత
  • మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రం సమర్పణ
  • గృహ నిర్మాణ శాఖ అధికారులు రేపే గ్రౌండింగ్ చేస్తామని హామీ
  • శుక్రవారం సాయంత్రంలోపు కొలతలు ఇవ్వకపోతే శనివారం ఆమరణ దీక్ష
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగర్ మండల కేంద్రం, కాశి తోట వీధిలో నివాసముంటున్న ఒక నిరుపేద జనసేన మహిళ సెల్వి ఇంటి నిర్మాణం కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. గతంలో మూడుసార్లు ఇంటి నిర్మాణ మంజూరు పత్రం కొరకు వినతి పత్రం సమర్పించినా స్పందన రాలేదు. ఈ ర్యాలీ బాధితురాలు ఇంటి వద్ద నుండి గాండ్ల మిట్ట మీదుగా కార్వేటినగరం ఎంపీడీఓ సముదాయం వరకు నిర్వహించడం జరిగింది. సమదాయము నుండి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్దకు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న వినూత్న రీతిలో పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు సంబంధిత గృహ నిర్మాణ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. అధికారులు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం లోపు గ్రౌండ్ చేయడానికి అన్ని అనుమతులు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒకవేళ శుక్రవారం సాయంత్రం లోపు కొలతలు ఇవ్వకపోతే శనివారం ఉదయం నుండి ఆమరణ దీక్ష చేస్తామని డాక్టర్ యుగంధర్ పొన్న తెలిపారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు గృహ నిర్మాణ శాఖ సంబంధిత అధికారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. స్వామి అసమర్ధుడని తెలుస్తోందని, అందుకే ఇంతటి వ్యతిరేకత నియోజకవర్గంలో అలుముకొని ఉన్నదని తెలిపారు. నిరుపేద ప్రజలకు అండగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించే వరకు వీరోచితమైన పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వండి, నియోజకవర్గంలో సర్వాంగ సమగ్ర అభివృద్ధిని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మండల బూత్ కన్వీనర్ అన్నామలై, మండల ప్రధాన కార్యదర్శి దేవేంద్ర, సోమశేఖర్, హరీష్, మండల కార్యదర్శి రూపేష్, నవీన్, టౌన్ కమిటీ ఉపాధ్యక్షురాలు మీనా, ప్రధాన కార్యదర్శి మనీ, సూర్య, కార్యదర్శి మహేంద్ర, జనసైనికులు పాల్గొన్నారు.