మహిళాదినోత్సవ శుభాకాంక్షలు: జనసేన జానీ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అతి గొప్ప కానుక ఇందు కోర్ట్ బిల్లు, ఈ బిల్లుతో మన దేశంలోనే ఆడవారు సామాజిక బ్రతుకుచిత్రాన్నే ఆయన మార్చేశారు. మగవారికి ఎలాగైతే ఆస్తి పంపకాలు ఉంటాయో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉన్నది అని స్పష్టం చేశారు. కనుక భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ మాతృమూర్తులు అందరికి జనసేన పార్టీలో ఉండే జనసేన వీరమహిళలు అందరికి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ తరపున, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయుకులు, జనసైనికుల తరపున భారతదేశ ఆడపడుచులందరికి జనసేన జానీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాని అన్నారు.