టి గోకులపాడులో జనసేన ప్రజా పోరాట యాత్ర

  • క్రిష్ణగిరి మండలం, టి గోకులపాడు గ్రామంలో పర్యటించిన సిజి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం, క్రిష్ణగిరి మండలం, టీ గోగులపాడు గ్రామంలో మండల నాయకులు నాగేశ్వరరావు, తిరుపాల్, ఖలీల్ ఆధ్వర్యంలో పర్యటించారు. అనంతరం జనసేన పార్టీ, నియోజకవర్గ నాయకులు, సిజి రాజశేఖర్, మాట్లాడుతూ టీ గోగులపాడు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉంది, మేము ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు మాకు తెలుపుతున్న విషయాలు ఏమిటంటే, ఈ డ్రైనేజీ వ్యవస్థ బాగా లేక పోవడం, వల్ల, కొన్నిచోట్ల సిసి రోడ్లు, లేక మురికి నీరు నుండి రోడ్లపై నిలిచిన దృశ్యాలు చూశాను, మురికి నీరు రోడ్లపై నిలచడం వల్ల గ్రామ ప్రజలకు డెంగ్యూ మలేరియా వంటి విశ్వజరాలు వస్తున్నాయని, బ్లీచింగ్ పౌడర్ కూడా, మా గ్రామంలో సరిగా చల్లడం లేదని, కొన్నిచోట్ల డ్రైనేజీ కాలువలు ఉన్నప్పటికీ ఆ డ్రైనేజీ కాలువలు కూడా నిండిపోయినా పట్టించుకోని అధికారులు, అలాగే త్రాగే నీటిలో పురుగులు వస్తున్నాయని కొంతమంది వ్యక్తం చేశారు, ఇప్పటికైనా మీరు మా సమస్యలను, మీ పార్టీ తరఫున అధికారులపై ఒత్తిడి పెంచి, మాకు మంచి సౌకర్యాలు కల్పించాలని, గ్రామస్తుల కోరారని తెలిపారు, గ్రామం మొత్తం పర్యటించిన తర్వాత, గ్రామ సచివాలయానికి వెళ్లి, గ్రామస్తులు చెప్పిన సమస్యలపై పంచాయతీ సెక్రెటరీ తో మాట్లాడడం జరిగింది, పై అధికారులైనా ఎంపీడీవో గారికి ఫోన్ ద్వారా సమస్యలు వివరించడం జరిగింది, వెంటనే పరిష్కరించాలని లేదంటే జనసేన పార్టీ తరపున ఏం చేయాలో నేను చేసి చూపిస్తామని చెప్పారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు సౌకత్, నరసింహుడు, రాముడు, షేక్షావలి, శ్రీకాంత్, చంద్ర, మరియు తదితరులు పాల్గొన్నారు.