ప్రకృతిని ప్రేమించండి.. పర్యావరణన్ని రక్షించండి: రామశ్రీనివాస్

ప్రపంచ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా..
అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండలం కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల నందు మొక్కలు నాటే కార్యక్రమం.

జనసేన పార్టీ ఆధ్వర్యంలో రామశ్రీనివాస్ కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల నందు 20 మొక్కలు, మాధురి స్కూల్ నందు 30 మొక్కలు నాటారు ఈ సందర్బంగా రామశ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించండి పర్యావరణన్ని రక్షించండి అంటూ.. భావితరాల భవిష్యత్తు కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ. మురళీధర్, పాఠశాల హెచ్ ఎం కుసుమా, పిఈటిఏ రోహిణి, శివకుమారి, మండల ఎఫ్ పి ఓ, సీఈఓ రమణయ్య, ఆర్ వీరణగయ్య, ఆంజనేయులు నాయుడు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.