మద్దికేర టౌన్, సాయి నగర్ లో జనసేన ప్రజా పోరాట యాత్ర

పత్తికొండ నియోజకవర్గం: మద్దికేర సాయి నగర్ లో ఉన్నటువంటి సుంకులమ్మ దేవస్థానంలో సుంకలమ్మ దేవతపై ఒట్టు వేసి మీ కాలనీలో ప్రధాన సమస్యగా ఉన్న సిసి రోడ్లు వేస్తానని హామీ ఇచ్చి మర్చిపోయిన పత్తికొండ ఎమ్మెల్యే, కంగాటి శ్రీదేవి అని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సీజ రాజశేఖర్ ఏద్దేవా చేసారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సాయినగర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారి నెరవేర్చాలి. మాట ఇవ్వడం, మాట తప్పడం వైసిపి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారికి అలవాటైపోయింది, వైసిపి నాయకులు ప్రతి ఒక్కరు చెప్తుంటారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చిన తర్వాతనే మేము ఎలక్షన్లో నిలబడుతామని, అలాగే పత్తికొండ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎమ్మెల్యే గారు పోటీ చేయాలి, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగాలని తెలియజేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మద్దికేర గ్రామంలోని సాయి నగర్ కాలనీకి సంబంధించిన ప్రజా సమస్యలను మౌలిక సదుపాయాల పనితీరును త్రాగునీరు, మరియు గృహపకరణాల అవసరానికి ఉపయోగించే నీరు సదుపాయాలు, మరియు కాలనీ రోడ్ల దుస్థితిని పారిశుద్ధ్య కాలువల గురించి కాలనీ వాసుని అడిగి తెలుసుకోవడం జరిగింది. కాలనీవాసులతో మేము మాట్లాడినప్పుడు సాయి నగర్ కాలనీ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు, పంచాయతీ ద్వారా ప్రధాన నీటిపారుదల సౌకర్యాన్ని పైప్ లైన్లను ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, మరియు కాలనీల మధ్య సిసి రోడ్లు డ్రైనేజీ సిసి రోడ్లుగా మార్చలేదని సిసి రోడ్లు లేకపోవడంతో గృహాల నుండి వచ్చే వ్యర్థ పదార్థాల నీరు రోడ్లపైకి నిలిచిన దృశ్యాలు చూసాము, కాలువలు నిర్మించలేదని వివరించడం జరిగింది. ప్రధానంగా సాయి నగర్ కాలనీ మొత్తానికి సంబంధించి కేవలం మూడు వీధి ట్యాంకులు ఏర్పాటు చేశారు. నీరు తెచ్చుకోవడానికి ముసలివారు, చిన్న పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ళకు నీరు అందించే విధానం సరిపోవడం లేదని, మరియు ఆ బోర్ల నుంచి వచ్చే నీరులో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుందని, కాలనీవాసులు మాకు తెలియజేశారు. మద్దికేర మండలంలోని సాయి నగర్ కాలనీకి సంబంధించినటువంటి గృహాల్లో దాదాపు 30% గృహాల్లో బాడుగలకు ఉన్నటువంటి కుటుంబాలకు జగనన్న కేటాయించినటువంటి జగనన్న కాలనీలో ఎటువంటి స్థలాలు కానీ, ప్రధానమంత్రి వికాస్ యోజన కింద ఇచ్చేటువంటి గృహకల్పన సంబంధించినటువంటి పథకాలు మాకు అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు గద్దల రాజు, అజయ్ కుమార్, ఎంపీటీసీ వడ్డే విరేష్, మనోజ్ కుమార్, వడ్ల నరేష్, అశోక్ కుమార్, ప్రభాకర్ యాదవ్, కిరణ్, లింగరాజు, విరేష్, అంజి, శ్రీకాంత్, సాయి, కాసిం, వంశీ పాల్గొన్నారు.