కానూరుగ్రామ దళితవాడ ప్రజల సమస్యల పై స్పందించిన జనసేన

తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోగల కానూరుగ్రామ దళితవాడ ప్రజల సమస్యలపై జనసేన నాయకులు స్పందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన కృష్ణా జిల్లా జాయింట్ సెక్రటరీ కాకాని లోకేష్ పాల్గొని.. దళిత పల్లె సమస్యలను పరిశీలించగా అక్కడ ప్రజలకు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పోవడం వలన మురుగుకాలవలో నీరు రోడ్లపైకి వచ్చి స్తంభించి ఉండి పోతున్నాయి. దానివలన కాలనీ మొత్తం మురికి వాడగా రూపాంతరం చెందటమే కాకుండా.. ఈగలు దోమలతో పాటూ.. పాములు కూడా సంచరించి ప్రజలు అనేక ఇబ్బదులు పడుతున్నట్లు తెలియచేశారు. అంతే కాకుండా తాగునీటి పైపులైన్ కూడా మురికినీళ్లలో కలిసి పోవటం వలన తాగునీరు కూడా కలుషితమై ప్రజలు అనేక వ్యాధులకు గురిఅవుతున్నారని.. ఇప్పుడే ఇటువంటి పరిస్థితి ఉంటే రానున్న వర్షాకాలంలో ఈ సమస్య మరింత జఠిలంగా మారి ప్రజల ప్రాణానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తుంది అని తెలిపారు. ఈ సమస్య ని స్థానిక మునిసిపల్ కమిషనర్ మరియు స్థానిక ఎమ్మెల్యే దృష్టి కి తీసుకువెళ్లినా కేవలం దళితవాడ అనే చిన్న చూపుతో.. పెడచెవిన పెడుతున్నట్లు స్థానిక ప్రజలు భావిస్తున్నారు అని లోకేష్ తెలియచేశారు. ముఖ్యంగా నైపుణ్యత లేని స్థానిక వైసీపీ కార్యకర్తలతో, ప్రభుత్వ రోడ్లు డ్రైనేజి లు నిర్మిచటం వలన ఆ వైసీపీ కార్యకర్తలకు అనుభవం మరియు పని పట్ల అవగాహన లేని కారణంగా ప్రజల్ని బలి పశువులను చేస్తున్నట్లుగావుంది. దీనికి స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి బాధ్యతవహించి సమస్య పరిస్కరించాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వం మెడలు వంచి ఐనా.. దళితవాడ ప్రజల సమస్యని పరిష్కరించే వరకూ.. జనసేన పార్టీ నిలబడుతుంది అని కాకాని లోకేష్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కరిమికొండ సురేష్, బోయిన మాణిక్యాలరావు, దోనాపూడి సురేష్, కొలంటి దేవదాసు తదితరులు పాల్గొన్నారు.