జనసేనాని చెప్పిందే .. నేడు హై కోర్ట్ చెప్పింది

ఏపీలో సినిమా టికెట్ ధరలపై నిర్మాతలకు ఊరట కలిగించింది ఏపీ హైకోర్ట్. సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వ జీ.వో నెం. 35ను కొట్టేసింది హైకోర్టు. ఈమేరకు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించింది హైకోర్టు. గతంలో టికెట్ రేట్లను తగ్గిస్తూ జీవో జారీచేసింది ఏపీ ప్రభుత్వం. పాత రేట్లు వర్తిస్తాయని తెలిపిన కోర్ట్, ప్రభుత్వ వైఖరి త్వరలో వెల్లడి కానుంది. రిపబ్లిక్’ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంతో పాటు ఇండస్ట్రీ పెద్దల తీరుని కూడా ప్రశ్నించారు పవన్. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. పవన్ చేసిన కామెంట్స్ కి తమకు ఎలాంటి
సంబంధం లేదంటూ ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్లి ఏపీ మంత్రుల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ.. టికెట్ రేట్స్ విషయంలో ఇండస్ట్రీకి అనుకూలంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం డిసైడ్ చేసే రేట్లకే టికెట్లను అమ్మాలని.. అది కూడా ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలోనే టికెట్స్ బుక్ చేయాల్సి ఉంటుందని జీవో జారీ చేసింది. ఇప్పటికీ ఈ విషయంపై అప్పుడప్పుడు దర్శకనిర్మాతలు, హీరోలు మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి ఈ ఇష్యూని రైజ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ దీక్ష చేపట్టారు. ఇదే సమయంలో ఆయన సినిమా టికెట్లు, థియేటర్ల వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు ఆపేసి ఆఆర్థిక మూలాల్ని కొడితే భయపడతాను అనుకున్నారు. అంత పంతానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తాం. ఆర్ధిక మూలాల మీద కొట్టినంత మాత్రాన భయపడతామా? సినిమా టిక్కెట్ల అమ్మకంలో పారదర్శకత లేదంటున్నారు. మీ పరిపాలనలో పారదర్శకత ఉందా? ఉంటేకోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఆ మాట అంటే బూతులు తిట్టేస్తారు. మీరు అమ్మే మందుకు పారదర్శకత ఉందా? అంతా క్యాష్ అండ్క్యారీ. ఏడాదిలో రూ. 40 వేల కోట్ల సంపాదన అంట. మన డబ్బులు తీసుకుని మన ఆరోగ్యాలు పాడు చేసి మళ్లీ మనకే అమ్ముతున్నారు. రూ. 700
పెట్టి మందుకొని రూ. 5తో సినిమాకు వెళితే సంతోషమా? ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కనీసం ఒక్క ప్రాజెక్టుకు అయినా శిలాఫలకం వేశారా? 500 మంది సలహాదారులు ఉన్నారు. ఏమి ప్రయోజనం. స్టీల్ ప్లాంట్ ని ఎలా ఆపాలో తెలియదు అని ఘాటు వ్యాఖ్యలు చేయటం విదితమే. ఈ వ్యాఖ్యలకు పర్యవసానంగా రాష్ట్రంలో ఉన్న సినిమా హాల్ టికెట్లు థరలు పైన జారీచేసిన జీఓ నెంబరు.35ను రాష్ట్ర హైకోర్టు అడ్డంగా కోట్టివేయటం జరిగింది. ఇన్నిసార్లురాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేయటం, మన రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ రెడ్డి కి పూర్తిగా అవమానం, న్యాయ పరిజ్ఞానం శూన్యతకు నిలువుటద్దం. అయనకు తన శాఖ పైన ఏమాత్రం పట్టులేదనే విషయం పలుసార్లు సుస్పష్టం అయింది. హై కోర్ట్ తీర్పు పై సదరు సంబంధం లేని ప్రముఖులు తమ తెలుగు బాషా బూతు పురాణం తో స్పందించాల్సి ఉంది.