వైసీపీకి సుపరిపాలన చేతకాదు

* ఎన్నికల సమరానికి ప్రణాళికతో సిద్ధమవుదాం
* గాజువాక నియోజకవర్గం పార్టీ సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

‘కలసికట్టుగా పని చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యం. వైసీపీ ప్రభుత్వ పాలన మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రజా వ్యతిరేక పాలన నిర్ణయాలను జనసేన పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంద’ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. సోమవారం గాజువాక నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో శ్రీ మనోహర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “సుపరిపాలన అనేది వైసీపీకి తెలియదు. అరాచకాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో విపరీతమైన కోపం ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. చిన్నపాటి పొరపాట్లకు కూడా తావు ఇవ్వకుండా జన సైనికులు, వీర మహిళలు కలసి పని చేయాలి. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో బలం పుంజుకుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో మనం ముందున్నాం. కష్టాల్లో ఉన్న పేదలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆపన్న హస్తం అందించారు. ప్రతి కష్టంలోనూ ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. వీటిని ప్రతి ఒక్కరికి తెలియ చెప్పాల్సిన బాధ్యత జనసైనికులు, వీర మహిళలపై ఉంది. వచ్చే ఎన్నికలకు పక్కా ప్రణాళికతో పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి” అన్నారు. ఈ సందర్భంగా గంగవరం పోర్టు కాలుష్య సమస్యపై అక్కడి నిర్వాసితులు శ్రీ మనోహర్ గారికి వినతిపత్రం అందించారు. ఈ సమావేశంలో పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరి ప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నాయకులు శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్, శ్రీ బోడపాటి శివ దత్, శ్రీమతి భీసెట్టి వసంత లక్ష్మి, శ్రీ దల్లి గోవింద రెడ్డి, శ్రీ తిప్పల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* 64వ డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభం
విశాఖపట్నం 64 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని శ్రీ మనోహర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసైనికులు, వీర మహిళలు శ్రీ మనోహర్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికల సమరానికి జనసైనికులు సిద్ధం కావాలని ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు పిలుపునిచ్చారు. ఇదే ఉత్సాహంతో ఎన్నికలకు వెళదామని, పార్టీ కార్యకర్తలకు నిరంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారి భరోసా ఉంటుందని చెప్పారు.