జనసేన ఆత్మీయ సమావేశం

కాకినాడ రూరల్, కరప చిరంజీవి కళ్యాణ మండపంలో జరిగిన హైదరాబాద్ జనసేన రాక్స్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్, రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వం మండల మరియు గ్రామ నాయకత్వం, జనసైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన టీ-షర్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించి జనసేనానికి రాబోయే ఎన్నికలలో ఒక అవకాశమివ్వాలని చెప్పడం జరిగింది.