జనసేన ఆత్మీయ సమావేశం

నెల్లిమర్ల, డెంకడ మండలం జనసేన పార్టీ పంచాయితీ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు అన్ని పంచాయితీల నాయుకులు మరియు ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కో-ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, మండల అధ్యక్షులు పతివాడ కృష్ణవేణి, గిరిజన నాయుకులు తుమ్మి అప్పలరాజు దొర, మండల నాయకులు లింగం లక్ష్మణ్, పైల శ్రీను, పైల సురేష్, ఏర్నింటి రమేష్, పిల్ల నాని, సుధాకర్, రమేష్, కొండ్రు రఘు, బమ్మిడి బుజ్జీ, బమ్మిడి రాము, ప్రసాద్, నవీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.