ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట

  • 15వ రోజు పాదయాత్రలో భాగంగా నేడు 27వ డివిజన్ చోదిమెళ్ళ గ్రామం పర్యటించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గం, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 15వ రోజు పాదయాత్రలో భాగంగా నేడు 27వ డివిజన్ చోదిమెళ్ళ గ్రామంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఏలూరు జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు డివిజన్లో ఉన్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి జనసేన పార్టీ సిద్దంగా ఉందని తెలియజేశారు. డివిజన్లో ఉన్న సమస్యలు మంచినీటి సదుపాయం అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, వృద్ధాప్య పెన్షన్, అమ్మ ఒడి లాంటి సంక్షేమ పథకాలు సరిగా అందట్లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు బేషుగ్గా ఇస్తున్నాను, నవరత్నాలు ప్రజలకు అందేలా చేస్తున్నాను అని చెప్పి పూర్తిస్థాయి సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా స్థానిక నాయకులు వ్యవహరిస్తున్నారని, వాలంటరీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తి అసంతృప్తి ఇస్తుందని రెడ్డి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ఆయన చేస్తున్న కౌలు రైతు భరోసా కార్యక్రమానికి అనూహ్యస్పందన వస్తుందని తెలియజేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ప్రజలను నమ్మించి అధికారం ఎక్కి నేడు ప్రత్యేక హోదా వస్తే పట్టించుకోని విధంగా తయారైన జగన్ మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. నిరుద్యోగ చదువుకున్న చదువుకు సరైన పని దొరక్క రాష్ట్రం దాటి పరాయి రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. సరైన పరిశ్రమ లేక ఉన్న ఒక ఏలూరు జ్యూట్ మిల్లును మూతపడేలా చేసి రెండు వేల కుటుంబాలు రోడ్లు పడేలాగా చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, మురళి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, మండల ఉపాధ్యక్షుడు సుందరనీడి ప్రసాద్, వీర మహిళ కావూరి వాణి, సరళ, ఉమా దుర్గా మరియు స్థానిక నాయకులు,చొదిమెళ్ళ డివిజన్ కమిటీ సభ్యులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.