తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు మదనపల్లిలో జనసేన మద్దతు

మదనపల్లి నియోజకవర్గం: మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరోధార్యం ఈరోజు టిడిపి బందు పిలుపుకు మా మద్దతు తెలియజేస్తున్నామని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మదనపల్లి జనసేన నాయకులు పేర్కొన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ అలాగే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పార్టీ కార్యక్రమాల నిమిత్తం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ బేగంపేటలో బయలుదేరినప్పటి నుండి అడుగడుగునా అధ్యక్షుల వారికి అడ్డంకులు సృష్టిస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా పోలీసు వ్యవస్థ వీళ్ళందర్నీ కూడా అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఊరు నుండి ఇంకో ఊరికి కూడా వెళ్లాలంటే పాస్పోర్ట్ వీసా ఏమన్నా తీసుకోవాలని కొత్త చట్టం ఏమైనా ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చారా అలాగే మీరు అనుమతించలేదని హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో వస్తున్న జనసేన అధ్యక్షులు వారిని జగ్గయ్యపేట దగ్గర పోలీసులు అడ్డుకోవడం వారి ప్రవర్తన ఇలాంటివన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే బ్రిటిష్ పాలన మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో మొదలైందా అన్న అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బేగంపేట విమానాశ్రయం నుండి రాత్రి మంగళగిరి చేరే దాకా వర్షం వస్తున్న కూడా వేలాది మంది జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు రాత్రి రెండు గంటలు దాటుతున్న కూడా రోడ్లమీద ఉండి అధ్యక్షుల వారికి అండగా ఉండటం అనేది ప్రజాస్వామ్యంలో ఒక నిజాయితీ ఉన్న నాయకుడికి ఏ విధంగా ప్రజల మద్దతు వుంది అని కచ్చితంగా తెలుస్తుంది, ఇలాగే వైసిపి ప్రభుత్వం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే మాత్రం ప్రజలు కాదు కదా ఏ ఒక్క చిన్న పిల్లోడు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర ఆటలు మానేసి ప్రభుత్వం మారి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే మంచిదని మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మదనపల్లి జనసేన నాయకులు టీం అధ్యక్షులు గోపికృష్ణ టీం సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, ధరణి, అరుణ పాల్గొన్నారు.